డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు
KMM: నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామం వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గర్భిణీ, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.