పార్లమెంట్‌లో 'మాస్కుల' నిరసన

పార్లమెంట్‌లో 'మాస్కుల' నిరసన

పార్లమెంట్ ఉభయసభలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. వాయు కాలుష్యంపై విపక్ష ఎంపీలు వినూత్న నిరసన చేపట్టారు. ముఖాలకు మాస్కులు ధరించి మకర ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. వెంటనే దీనిపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.