చింతనెక్కొండలో మట్టిమాఫియా ఆగడాలు
WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండలో మట్టిమాఫియా ఆగడాలు పెరుగుతున్నాయని గ్రామస్తులు శనివారం తెలిపారు. మట్టిగుట్టలను లక్ష్యంగా చేసుకుని ఎక్స్కవేటర్లతో పగలు, రాత్రి తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. పచ్చని చెట్లను తొలగిస్తూ టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఈ ఘటనపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.