'ఆపరేషన్ సింధూర్ 2.0 అనివార్యంగా కనిపిస్తోంది'
విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దుశ్యంత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ఇంకా ఎగదోస్తున్న నేపథ్యంలో 'ఆపరేషన్ సింధూర్ 2.0' అనివార్యంగా కనిపిస్తోందని అన్నారు. భారత సైన్యం దీనికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఇప్పటికీ అస్థిరంగా ఉందన్నారు. LOC వెంబడి పాక్ పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.