పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: ఎంపీడీవో

NDL: సంజామల మండల పరిధిలోని కానాలలో మూడో శనివారం పురస్కరించుకొని ఎంపీడీవో రామసుబ్బయ్య ఆధ్వర్యంలో 'స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్' కార్యక్రమం నిర్వహించారు. ZPHS విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రతపై ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ఎంపీడీవో పిలుపునిచ్చారు. PS వెంకటనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.