అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి
MLG: అర్హులైన పేదలకు ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. మలుగు మున్సిపాలిటీ 5వ వార్డులో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 99 రోజులపాటు నిర్వహించే ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ములుగు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని సీతక్క పిలుపునిచ్చారు.