VIDEO: నకరికల్లులో ఫుడ్ కమిషన్ సభ్యుల తనిఖీలు
PLD: నకరికల్లులోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే భోజనం తప్పనిసరిగా నాణ్యత కలిగి ఉండాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి ఆదేశించారు. నకరికల్లులోని అంగన్వాడీ కేంద్రాలను, ZPHS పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.