నేడు కొమ్మినేపల్లిలో పండితాపురం సంత వేలం
KMM: కామేపల్లి మండలంలోని కొమ్మినేపల్లి పండితాపురంలో శ్రీకృష్ణప్రసాద్ పశువుల వారాంతపు సంత వేలం పాట ఇవాళ నిర్వహించనున్నట్లు సర్పంచ్ ధరావత్ అనురాధ, కార్యదర్శి శంకర్ తెలిపారు. గతంలో రెండుసార్లు వాయిదా పడిన ఈ వేలం, ఈనెల 13న మంత్రి పర్యటన కారణంగా, ఆ తర్వాత మద్దతు ధర రాకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు శుక్రవారం సంత ఆవరణలో వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.