నల్గొండ BJP కార్యాలయం వద్ద ఉద్రిక్తత

నల్గొండ BJP కార్యాలయం వద్ద ఉద్రిక్తత

TG: నల్గొండ BJP కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. BJP కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తీసేయడంపై ఆందోళన చేశారు. ఈ క్రమంలో BJP ఆఫీసుపై కోడిగుడ్లతో దాడి చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో.. కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. DCC అధ్యక్షుడితో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.