హోంగార్డు సిబ్బందికి దర్బార్ నిర్వహించిన సీపీ

SDPT: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జిల్లాలో ఉన్న హోంగార్డు సిబ్బందికి పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ ఆధ్వర్యంలో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఉన్న వారి సమస్యలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె అన్నారు. పోలీస్ అధికారులు, హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.