VIDEO: సర్వీస్ రోడ్డు నిర్మించాలని రైతుల ఆందోళన

VIDEO: సర్వీస్ రోడ్డు నిర్మించాలని రైతుల ఆందోళన

కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సింగాపూర్ శివారులో రైతులు ఆందోళన చేపట్టారు. రహదారి విస్తరణలో పాత దారులు మూసుకుపోవడంతో పొలాలకు వెళ్లే మార్గం లేక వరి కోతలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని, రోడ్డు నిర్మించే వరకు నిరసన విరమించేది లేదన్నారు.