ఎంపీ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిక

సంగారెడ్డి: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో పలువురు కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందని, అభివృద్ధి పథంలో తెలంగాణకు కూడా బీజేపీ పాలన అవసరమని అన్నారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి పాల్గొన్నారు.