ఢిల్లీకి వెళ్లిన స్పీకర్

TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వారు అఖిల భారత స్పీకర్ల సదస్సులో పాల్గొంటారు. ఈ పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో దేశంలోని అన్ని రాష్ట్రాల స్పీకర్లు, డిప్యూటీ ఛైర్మన్‌లు పాల్గొని, శాసనసభల నిర్వహణ, ప్రజాస్వామ్య ప్రక్రియలు, కొత్త చట్టాల అమలు వంటి అంశాలపై చర్చిస్తారు.