నేడు మహానందిలో ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు

నేడు మహానందిలో ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు

NDL: మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పోటీల్లో విజేతలైన యజమానులకు రూ.9 లక్షల నగదు బహుమతులను అందించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి వృషభాలు వస్తాయన్నారు.