జల్ జీవన్ మిషన్ పనులను పర్యవేక్షించాలి: పవన్
AP: గ్రామీణ ప్రాంతాల్లోనూ తాగునీటిని సరఫరా చేయటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు పవన్ సూచించారు. నీటి సరఫరా పథకాలు సమర్థంగా అమలు అవ్వాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలను జరపాలని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు.