దేవస్థానం పాలకమండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

సత్యసాయి: కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి నియామకానికి దేవదాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల వారు ఫారం-II ద్వారా 27 ఆగస్టు 2025 సాయంత్రం 6 గంటలలోపు దేవస్థానం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి, ఆలస్యంగా వచ్చినవి స్వీకరించబడవు అని అధికారులు తెలిపారు. వివరాలకు 08494-221066 సంప్రదించవచ్చని సూచించారు.