సుంకేసుల నిర్వాసితులకు స్మశానం భూముల పరిశీలన

సుంకేసుల నిర్వాసితులకు స్మశానం భూముల పరిశీలన

మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్‌లో భాగంగా సుంకేసుల గ్రామ నిర్వాసితులకు స్మశానం కోసం కేటాయించిన భూములను మార్కాపురం తహసీల్దార్ కె. చిరంజీవి గురువారం పరిశీలించారు. భూముల పరిస్థితి, అందుబాటు సౌకర్యాలు, స్థానిక అవసరాలను ఆయన పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ అంశంపై పూర్తి నివేదికను ప్రాజెక్ట్ నిర్వాహకులు, జిల్లా సంయుక్త కలెక్టర్‌కు సమర్పించినట్లు ఆయన తెలిపారు.