బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక
HYD: ఆషాఢ బోనాలపై మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జూన్ 26న గోల్కొండ బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, జూలై 24న ముగియనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3, 026 దేవాలయాల పరిధిలో ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఏటా నిధుల్లో 10% పెంపు చేసినట్టు తెలిపారు. శాంతి భద్రతలతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.