యువకుడు అదృశ్యం కేసు నమోదు
కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలో నివసించే షేక్ రహమత్ అలీ (30 సంవత్సరాలు) యువకుడు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంటి వద్ద కనిపించకుండా పోయాడు. యువకుడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదని, ఈ మేరకు యువకుడి తల్లి షేక్ జకీరున్నిసా w/o సలీం గుడివాడ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు పిర్యాదు చేశారు.