ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

JGL: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 46 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. అర్జీలపై సమగ్ర విచారణ చేసి పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.