కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

RR: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 36మంది లబ్ధిదారులకు రూ.36,04,176 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం పట్ల నిబద్దతతో ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏండ్ల తరబడి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు సకాలంలో అందలేదని ఎమ్మెల్యే అన్నారు.