VIDEO: గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించడంపై సిద్ధవటంలో బంద్
KDP: సిద్ధవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసేందుకు గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించడంపై దీనికి వ్యతిరేకంగా సిద్ధవటం మండలంలో ప్రజలు మంగళవారం బంద్ నిర్వహించారు.దుకాణాలు,పాఠశాలలు,పలు ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసేశారు. సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలంటూ ప్రజలు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.