నర్సింగాపూర్‌లో మహిళ అదృశ్యం

SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామం చెందిన మల్యాల రాజేశ్వరి అనే మహిళ అదృశ్యమైనట్లు చందుర్తి ఎస్సై రమేష్ తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిందనీ, మహిళ ఆచూకీ తెలిసినట్లయితే స్థానిక చందుర్తి పోలీస్ స్టేషన్‌కు, డయల్ 100కి సమాచారం ఇవ్వాలన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.