VIDEO: పొంగి పొర్లుతున్న మ్యాన్ హోల్స్

VSP: జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కంచరపాలెం ITI జంక్షన్ వద్ద మ్యాన్ హోల్స్ నుంచి మురుగునీరు బయటకు ప్రవహిస్తోంది. కాలువలో పేరుకుపోయిన చెత్తవ్యర్థాలు, ప్లాస్టిక్ కారణంగా మ్యాన్ హోల్లో మురుగు నీరు చిమ్ముతూ రోడ్లపై వెళ్ళేవాళ్ళని బెంబేలెత్తిస్తోంది. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.