పెందుర్తిలో కొవ్వొత్తులతో ర్యాలీ

VSP: జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులకు సంతాపంగా పెందుర్తిలోని 95వ వార్డు పురుషోత్తపురం ప్రజలు శనివారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముష్కరుల చర్యలను ఖండిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.