'సర్కారు బడులను కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్దుదాం'

'సర్కారు బడులను కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్దుదాం'

KNR: సర్కారు బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ రాంనగర్ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఆయన, మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టి, పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నిధులతో త్వరలోనే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తామన్నారు.