WPL వేలం.. పోటీలో 277 మంది ప్లేయర్లు
WPL 2026 కోసం ఈ నెల 27న వేలం జరగనుంది. WPL ఆడే 5 ఫ్రాంచైజీల్లో 73 స్లాట్స్ ఖాళీ ఉండగా.. మొత్తం 277 మంది ప్లేయర్లు పోటీలో ఉన్నారు. వీరిలో 194 మంది స్వదేశీ ప్లేయర్లు కాగా, 83 మంది విదేశీయులు. వేలంలో దీప్తీశర్మ, రేణుకా సింగ్, సోఫీ డివైన్(NZ), సోఫీ ఎక్లెస్టోన్(ENG), అలీసా హేలీ(AUS), అమెలియా కెర్(NZ), మెగ్ లానింగ్(AUS), లారా వోల్వార్డ్(SA) కోసం తీవ్ర పోటీ ఉండనుంది.