జూలోకి కంగారూల ఎంట్రీ.. సందర్శకులకు పండగే!
TG: HYDలోని నెహ్రూ జూపార్క్ సందర్శకులకు శుభవార్త. త్వరలో ఆస్ట్రేలియా కంగారూలు మన జూలో సందడి చేయనున్నాయి. గుజరాత్‌లోని 'వంతార' నుంచి ఒక జంట కంగారూలను తీసుకొస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా మన జూ నుంచి ఒక ఏనుగును(జంబో) ఇస్తున్నారు. ఇక్కడ కంగారూలు ఉండటం ఇదే తొలిసారి. అలాగే, మగ జిరాఫీ 'సన్నీ'కి జోడీగా మైసూర్ నుంచి ఆడ జిరాఫీని కూడా తెస్తున్నారు.