విదేశీ పక్షులు అక్రమ రవాణా పట్టివేత

SKLM: కలకత్తా నుంచి చెన్నైకు విదేశీ పక్షులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పలాస-కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. 236 పక్షులను కారులో తరలించేందుకు పన్నాగాం వేశారు. ఈ క్రమంలో పలాస హైవేపై ఉన్న ఓ రెస్టారెంట్ వద్ద స్మగ్లర్లు విశ్రాంతి తీసుకుంటుండగా సమాచారం అందుకున్న అటవీశాఖాధికారులు దాడి చేసి పక్షులను స్వాధీనం చేసుకున్నారు.