సామాన్యులపై భారం పడొద్దు: మోదీ
నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని PM మోదీ సూచించారు. యుద్ధం పేరుతో బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల ధరలు పెరగకుండా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని మోదీ ఆదేశించారు.