VIDEO: విద్యుత్ స్మార్ట్ మీటర్‌లో మంటలు

AKP: గొలుగొండ మండలం, ఏ.ఎల్.పురంలో తప్పిన పెను ప్రమాదం.ఏ ఎల్ పురం గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ వెనుక నివసిస్తున్న పైల సూరిబాబు ఇంటిలో గురువారం అర్ధ రాత్రి రెండు మూడు సమయంలో అకస్మాత్తుగా మీటర్ల నుంచి దట్టమైన పొగ కమ్ముకొని మంటలు చెలరేయిగాయని భయంతో బయటకు పరుగులు తీశామని, బాధితులు తెలిపారు. ఇంట్లో ఉన్న కొన్ని సామాగ్రి ధ్వసం అయ్యాయని బాధితులు వాపోయారు.