రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన

రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన

VZM: గజపతినగరంలో రక్షిత మంచినీటి పథకానికి గ్రామ సర్పంచ్ నరవ కొండమ్మ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండమ్మ మాట్లాడుతూ.. బజారు జంక్షన్ వద్ద, (పాత వాటర్ ట్యాంక్ వద్ద) నూతనంగా రక్షిత మంచినీటి పథకం మంజూరైనట్లు తెలిపారు. ఉప సర్పంచ్ కర్రి రామునాయుడు, ఎంపీటీసీ కర్రి కళావతి, పంచాయతీ కార్య నిర్వహణ అధికారి జి. జనార్దనరావు పాల్గొన్నారు.