రైలు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు మృతి
VZM: గజపతినగరం- గరుడబిల్లి రైల్వే స్టేషన్ల మధ్య బొండపల్లి సమీపంలో రైలు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు విజయనగరం రైల్వే ఎస్.ఐ బాలాజీ రావు శుక్రవారం తెలిపారు. గురువారం సుమారు రాత్రి 9:30 సమయంలో యువకుడుని రైలు ఢీకొనడం వల్ల లేదా రైలులో నుండి జారిపడటం వలన గాయపడి అక్కడకక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.