వెలుగులోకి 17వ శతాబ్దం నాటి చాముండేశ్వరి విగ్రహం!
KDP: మైదుకూరు (M) ఉప్పగుంటపల్లెలో 17వ శతాబ్దం నాటి అరుదైన చాముండేశ్వరి దేవి విగ్రహం వెలుగుచూసింది. స్థానిక పొలాల్లోని నాగులపుట్ట వద్ద శుభ్రం చేస్తుండగా ఈ అద్భుత శిల్పం బయటపడినట్లు చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ నిన్న తెలిపారు. శిల్పంలో దేవి 4 చేతులలో ఢమరుకం,ఖడ్గం,త్రిశూలం,అసురుని తల పట్టుకుని, పాదాల కింద రాక్షసులను అణచివేస్తూ సుఖాసనంలో కూర్చుని ఉందని స్థానికులు వెల్లడించారు.