రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
SRPT: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యిన ఘటన గురువారం మునగాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కోదాడ నుంచి సూర్యాపేట వెళ్తున్న ద్విచక్ర వాహనం మునగాల మండల కేంద్రంలో మరో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.