మాజీ మంత్రిని కలిసిన పీసీసీ పరిశీలకులు

NRML: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) పరిశీలకుడు శేఖర్ గౌడ్ నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో పార్టీ బలోపేతం, కార్యకర్తల చొరవ, రానున్న కార్యాచరణపై చర్చించారు.