వర్ధన్నపేట పీహెచ్‌సీ సందర్శించిన DHMO
WGL: రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బి. సాంబశివరావు సూచించారు. గురువారం వర్ధన్నపేట పట్టణంలోని పీహెచ్‌సీని ఆయన సందర్శించి వైద్య సేవలు, సిబ్బంది హాజరు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును సమీక్షించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు తీరును, రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు.