ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై చర్యలు

మెంటాడ మండలంలోనివివిధ గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఐసీడీఎస్ పీడీ బి.శాంతి కుమారి స్పందించారు. గురువారం ప్రచురితమైన కోడ్ ఉల్లంఘన కథనంపై స్పందించిన పీడీ.. కొండ మామిడివలస అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కోడిగుడ్లపై ముద్రించి ఉన్న జగనన్న గోరుముద్ద పేరుపై రంగు పూయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.