మండలంలో విద్యుత్ అంతరాయం
KMM: బోనకల్ మండలంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మనోహర్ తెలిపారు. మధిర క్రాస్ రోడ్డు నుంచి రావినూతల సబ్‌స్టేషన్ వరకు 33కెవి లైన్ పనులు జరుగుతుండటంతో రావినూతల సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పెర్కోన్నారు.