'కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం'
BDK: మణుగూరు పట్టణంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే, BRS జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు నూతన BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు.