VIDEO: 'వెంటనే పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలి'
MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే పిల్లర్స్, స్లాబ్ వరకు పనులు పూర్తయ్యాయి. కానీ, నిధుల కొరతతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ సమస్యపై అధికారులు త్వరగా స్పందించి పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.