వినుకొండలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

PLD: వినుకొండలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. శ్రావణ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా పట్టణ పురోహితుడు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో వాసవి కళ్యాణ మండపంలో మహిళలు ఈ వ్రతాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.