కృష్ణపట్నంలో తమిళ జాలర్ల పడవ పట్టివేత

కృష్ణపట్నంలో తమిళ జాలర్ల పడవ పట్టివేత

NLR: జిల్లాలోని కృష్ణపట్నం తీరానికి తమిళనాడుకు చెందిన జాలర్ల పడవ ఎలాంటి అనుమతులు లేకుండా చేరుకుంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న మెరైన్, మత్స్యశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏడుగురు జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పడవను స్వాధీనం చేసుకుని జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు తరలించారు. వారు చేపల వేట కోసం ఈ తీరానికి వచ్చినట్లు తెలుస్తోంది.