'ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలి'
JGL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకురాని లబ్ధిదారుల స్థానంలో అర్హులైన కొత్త వారిని ఎంపిక చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఆర్థికపరమైన సమస్యలు ఉంటే సెర్ఫ్, మెప్మా ద్వారా రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు.