'గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించాలి'

'గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించాలి'

KMM: గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలకు గాను ప్రభుత్వం నిధులు కేటాయించాలని CPI ML మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం చింతకాని ఎంపీడీవో కార్యాలయం ఎదుట మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందించారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు.