క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: DMHO

క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: DMHO

SRPT: జిల్లాను క్షయ రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని డీఎంహెచ్‌‌వో డాక్టర్‌ పెండెం వెంకటరమణ అన్నారు. బుధవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 52,000 మందికి టీబీ పరీక్షలు నిర్వహించగా, 765 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు. లక్షణాలు ఉన్నవారిని త్వరగా గుర్తించి, అత్యాధునిక సాంకేతికతతో మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.