జిల్లాలో గ్యాస్ కొరత.. పెరిగిన ధరలు
W.G: ఆకివీడులో వంట గ్యాస్ కొరత కారణంగా సిలిండర్ ధరలు పెరగడం చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధిక ధరకు గ్యాస్ కొనలేక టీ ధరను రూ.10 నుంచి రూ.15కు, పానీపూరి ప్లేటు రూ.20నుంచి రూ.25కు పెంచారు. టీ షాపులు, చిరు తిళ్ల వ్యాపారులు జీవనోపాధి కోసం గత్యంతరం లేక ధరలు పెంచుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలపై కూడా ఆర్థిక భారం పడుతోంది.