ఏఎస్సైకి ఇండియన్ పోలీస్ మెడల్

MBNR: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై మొహమ్మద్ మొయిజుద్దీన్‌కు భారత ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించింది. 1989లో కానిస్టేబుల్‌గా చేరిన ఆయన, వివిధ పోలీస్ స్టేషన్లలో సేవలందించి, పదోన్నతులు పొందుతూ ప్రస్తుతం కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు.