విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
CTR: వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో విద్యుత్ షాక్‌తో బోడిరెడ్డి నాగరత్నం రెడ్డి అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంట్లో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ వైరును తాకారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.