VIDEO: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ
KNR: కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో జరిగే శ్రీ అలర్ మేల్ మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన నివాసంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ స్వామి వారి కృప పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్దిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, ఆలయ కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.